అరగుండుతో కన్నీళ్లు పెట్టుకున్న మాస్టర్‌!

33
rajashekar master

బిగ్ బాస్ ఎపిసోడ్ 42లో భాగంగా అరగుండు చేయించుకున్నారు అమ్మ రాజశేఖర్ మాస్టర్‌. అమీ తుమీ టాస్క్‌లో భాగంగా అరగుండు చేయించుకునేందుకు సిద్దమైన ఇంటి సభ్యులు వారించడంతో వెనక్కితగ్గిన మాస్టర్‌….తాజాగా నాగ్ ఇచ్చిన ఆఫర్‌తో అనుకున్న పనిచేసేశాడు.

నాగ్‌ ఇచ్చిన రెండో డీల్‌లో భాగంగా హాఫ్ షేవ్ (అరగుండు, అరగడ్డం) చేసుకుంటే వచ్చేవారం నామినేషన్స్ నుంచి సేవ్ కావొచ్చని లేదంటే మీకు ఇష్టమైన వాళ్లను సేవ్ చేయొచ్చని డీల్ ఇచ్చారు. దీంతో ఒక్క క్షణం ఆలోచించకుండా ముందుకొచ్చిన నాగ్‌ ఆల్రెడీ డిసైడ్ అయ్యా.. హాఫ్ సేవ్ చేయించుకుంటా అని చెప్పాడు. రాజశేఖర్ మాస్టర్ సగం గుండు చేయించుకోవడానికి సిద్ధం కావడంతో దివి బోరు బోరును ఏడ్చింది.

నోయల్…మాస్టర్‌కి అరగుండు చేయగా తర్వాత మాస్టర్ బోరున ఏడ్చాడు మాస్టర్‌. లైఫ్‌లో ఎంతో పోయింది ఇది లెక్క కాదు.. ఏదో గ్రేట్ అనిపించుకోవాలని కాదు దేవుడికి ఇచ్చానని చెబుతూ తెగ ఫీల్ అయ్యారు. అయితే నాగ్‌ని ఓదార్చుతూ కళలకు రూపం నటరాజు ఆయన రూపం అర్థనాదీశ్వర రూపం ఆయన్ని తలుచుకోండి.. మీరు గొప్ప త్యాగం చేశారని అన్నారు నాగ్‌.