హారిక…కెవ్వు కేక

421
dethadi harika

బిగ్ బాస్ సీజన్ 4 ఏడోవారం చివరి దశకు చేరుకుంది. ఈవారం ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యేది ఎవరో మరికొద్దిగంటల్లో తెలవనుండగా శుక్రవారం ఎపిసోడ్‌లో భాగంగా బ్లాక్ బస్టర్ సినిమా తీయాలని ఇంటి సభ్యులను కోరారు.

ఆ తరవాత నుంచి సినిమా చేయడం కోసం డిస్కషన్లు.. ఒకరి అభిప్రాయాలు ఇంకొకరికి నచ్చకపోవడం.. చిరాకులు, పరాకులు ఇలా సాగుతూ వెళ్లింది ఈ టాస్క్. అయితే, ఇలాంటి సమయంలో ఐటమ్ డాన్సర్స్ హారిక, సోహెల్ కాస్త ఉపసమనాన్ని అందించారు.

కెవ్వు కేక సాంగ్‌కి వీరిద్దరితో కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ రిహార్సిల్స్ చేయించారు. హారిక కాస్త కన్‌ఫ్యూజ్ అయినా మంచి మాస్ స్టెప్పులతో దుమ్ము దులిపింది. ముఖ్యంగా కెవ్వు కేక సాంగ్‌కి అదరిపోయే స్టెప్పులేసి బోరుగా సాగుతున్న ఎపిసోడ్‌లో కాసింత కలర్స్‌ చూపించారు. ముఖ్యంగా అరియానాకు సోహెల్ నుంచి మంచి కోపరేషన్ లభించింది. దీంతో ఐటమ్ సాంగ్‌ని ఇద్దరు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు.