బిగ్ బాస్ 3 వితిక ఎలిమినెట్..వరుణ్ భావోద్వేగం

476
Vithika
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 3 చివరి దశకు చేరుకుంది. ఇంకో రెండు వారాల్లో టైటిల్ విన్నర్ ఎవరో తేలనుంది. నిన్నటితో ఈషో 12వారాలు పూర్తి చేసుకుంది. కాగా ఈ వారం ఎలిమినేషన్ లో ఇంటి సభ్యులు అందరూ ఉన్నారు. కాగా శనివారం ఎపిసోడ్ లో శ్రీముఖి, బాబా భాస్కర్, రాహుల్ లను సేవ్ అవుతున్నట్లు ప్రకటించారు నాగార్జున. ఇక నిన్నటి ఎపిసోడ్ లో అలీ రెజా, వరుణ్ సందేశ్, శివ జ్యోతి, వితికలు ఉన్నారు. ముందుగా శివజ్యోతి సేవ్ అవుతున్నట్లు ప్రకటించారు నాగార్జున.

ఇక భార్య భర్తలైన వరుణ్ సందేశ్, వితికా షేరుల్లో చివరికి వితికా షేరును ఎలిమినేట్ చేసాడు బిగ్‌బాస్. వితికా షేరు ఎలిమినేట్ కావడంతో వరుణ్ సందేశ్ భావోద్వేగానికి గురయ్యాడు. ఇన్ని రోజులపాటు హౌస్‌లో కలిసి ఉన్న భార్య వితిక వెళ్లిపోతుంటే వరుణ్ సందేశ్ తట్టుకోలేకపోయాడు. గట్టిగా పట్టుకుని ఏడ్చేశాడు. దీంతో వితిక కూడా కన్నీరుపెట్టుకుంది. ‘మా ఆయనను జాగ్రత్తగా చూసుకోండి’ అని సభ్యులకు చెప్పి వరుణ్‌కు ముద్దిచ్చి హౌస్ నుంచి బయటకు వెళ్లింది.

- Advertisement -