బిగ్ బాస్3… ధియేటర్స్ లో శ్రీముఖి యాడ్స్

431
Srimukhi Biggboss
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 3 రసవత్తరంగా సాగుతుంది. ఇంకో మూడు వారాల్లో బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. మొత్తం హౌస్ లోకి 17మంది సభ్యులు ఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం 7గురు మాత్రమే ఉన్నారు. గత వారం హౌస్ నుంచి మహేశ్ విట్టా ఎలిమినెట్ అయ్యారు. ఇక ఈ వారం నామినేషన్స్‌ లో ఇంట్లో 7గురు సభ్యులు ఉన్నారు. శ్రీముఖి, అలీ రెజా, వరుణ్ సందేశ్, వితికా షెరు, రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్, శివజ్యోతి లలో మరో రెండు వారాల్లో ఇద్దరు కంటెస్టంట్లు బయటకి రానున్నారు.

టాప్ 5లో నుంచి ఎవరినో ఒకరిని విజేతగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హోస్ లో ఉన్న 7గురికి బయట ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హౌస్ లో ఉన్న వాళ్లలో అందరికంటే ఎక్కువగా శ్రీముఖి, వరుణ్ సందేశ్ కొంచెం ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకోవాలి. తాజాగా శ్రీముఖి ఫ్యాన్స్ థియేటర్లలో యాడ్ ఇచ్చారు. ఓట్ ఫర్ శ్రీముఖి’ అంటూ ఫోన్ నెంబర్ తో సహా ఒక ప్రకటనను థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ యాడ్స్ ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొంత మంది సోషల్ మీడియా ద్వారా శ్రీముఖిని ట్రోల్ చేస్తున్నారు.

- Advertisement -