బిగ్‌బాస్ హౌస్‌లో సరికొత్త హోటల్ టాస్క్ ప్రారంభమైంది. ఈ గేమ్‌లో కంటెస్టెంట్స్ తమ తెలివితేటలు, సేవలు, ఆతిథ్యంతో గెస్టులను మెప్పించాల్సి ఉంటుంది. ఎల్లో లెవెల్ సభ్యులు హోటల్ ఓనర్లుగా, రెడ్ లెవెల్ సభ్యులు వర్కర్లుగా, గ్రీన్ లెవెల్ సభ్యులు గెస్టులుగా వ్యవహరిస్తారు. గెస్టులు సేవలకు డబ్బులు, ఆతిథ్యానికి స్టార్స్ అందించవచ్చు. వర్కర్లు ఎక్కువ డబ్బు సంపాదిస్తే ఎల్లో లెవెల్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువ స్టార్స్ సంపాదించిన ఓనర్ నేరుగా గ్రీన్ లెవెల్‌కు చేరుకుని ఎలిమినేషన్ నుంచి సేఫ్ అవుతారు.
ఈ టాస్క్‌లో దేబ్జానీ పర్ఫెక్షన్ కోరుకునే రిచ్ గర్ల్‌గా, ముకేశ్ ఆమె బాయ్‌ఫ్రెండ్‌గా నటించారు. నీతూ గాసిప్ క్వీన్‌గా, త్రిగుణ్ డాన్‌గా, అమన్ అతడి సహాయకుడిగా కనిపించారు. రోహిత్, శ్వేత, సుధీర్ హౌస్‌కీపింగ్, వెయిటర్ బాధ్యతలు తీసుకోగా, రామకృష్ణ, ఝాన్సీ వంటవాళ్లుగా వ్యవహరించారు.
గేమ్ మొదలైన తర్వాత కంటెస్టెంట్స్ మధ్య డీలింగ్స్, స్టార్‌ల కోసం బేరసారాలు మొదలయ్యాయి. వర్షిణి, శివ తమ హోటల్‌కు వచ్చిన దేబ్జానీ, ముకేశ్‌లను మెప్పించే ప్రయత్నం చేశారు. అయితే ముకేశ్ మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని నీతూ చెప్పడంతో కథ మలుపు తిరిగింది. అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు చూపించడంతో దేబ్జానీ, ముకేశ్ మధ్య గొడవ జరిగి బ్రేకప్ డ్రామా చోటుచేసుకుంది.
ALso Read:హ్యాపీగా ఎంజాయ్ చేసే ‘దొంగ నా కొడుకు’
ఇదిలా ఉండగా ముకేశ్, వర్షిణి ముద్దు పెట్టుకున్న ఫొటోను బిగ్‌బాస్ పంపించారు. ఆ ఫొటోను రోహిత్ ముకేశ్‌కు రూ.300కు ఇచ్చేయడం ఆసక్తికరంగా మారింది. అనంతరం స్క్రీన్‌పై ఫొటోను చూపించడంతో హౌస్‌లో సందడి నెలకొంది. మరోవైపు నీతూ, త్రిగుణ్, అమన్ తమ డబ్బులను స్టార్స్ కోసం ఉపయోగించారు.
చివరగా ఓనర్లు, వర్కర్ల మధ్య సమన్వయాన్ని పరీక్షించేందుకు బిగ్‌బాస్ కమ్యూనికేషన్ టాస్క్ నిర్వహించారు. ఇందులో వర్షిణి, రోహిత్ జోడీ విజయం సాధించింది. దీంతో వర్షిణికి ఒక స్టార్, రోహిత్‌కు డబ్బులు లభించాయి. ఈ పరిణామాలతో హోటల్ టాస్క్ మరింత ఆసక్తికరంగా మారింది.

