BB10: ముకేశ్‌పై దేబ్జానీ రివేంజ్

3
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 10 తెలుగు విజయవంతంగా 60 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా నీతూ మాస్టర్, త్రిగుణ్ మధ్య వాగ్వాదం జరిగింది. వంశీతో కలిసి మాట్లాడుకోవాలని చెప్పి తనను మోసం చేశారని నీతూ ఆరోపించింది. రోహిత్ చెప్పిన మాట వినకుండా తప్పు చేశానని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ముకేశ్‌పై గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించగా, త్రిగుణ్ అలా అనలేదని శ్వేత వివరణ ఇచ్చింది.

మరోవైపు ఫ్యామిలీ వీక్‌కు సంబంధించిన గేమ్‌లో వంశీ గెలవడంతో వర్షిణి కుటుంబ ఫొటోను తొలగించాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. దీంతో వర్షిణి కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం అమన్ తన పేరును రివేంజ్ జాబితాలో రాయడంతో త్రిగుణ్ తీవ్రంగా బాధపడ్డాడు. తన కూతురు వస్తే మొదట ఎత్తుకుంటానని చెప్పిన అమన్ ఇలా చేయడం నమ్మలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.

తర్వాత జరిగిన బాస్కెట్‌బాల్ తరహా టాస్క్‌లో త్రిగుణ్, దేబ్జానీ, రాంప్రసాద్, నరేశ్, శివ పోటీపడ్డారు. చివరికి త్రిగుణ్, శివ మధ్య హోరాహోరీ పోటీ జరగగా త్రిగుణ్ విజయం సాధించి ఫ్యామిలీ వీక్‌కు అర్హత పొందాడు. ఈ సందర్భంగా అమన్ నిర్ణయంపై తన అసంతృప్తిని మరోసారి బయటపెట్టాడు.

ఇక ‘రంగుల తార’ టాస్క్‌లో దేబ్జానీ, నరేశ్, నీతూ మాస్టర్ పోటీపడ్డారు. రంగుల హ్యాండిల్స్‌ను సరైన క్రమంలో అమర్చి స్టార్‌ను దక్కించుకోవాల్సిన ఈ గేమ్‌లో దేబ్జానీ విజేతగా నిలిచింది. దీంతో ముకేశ్‌కు ఫ్యామిలీ వీక్ అవకాశం లేకుండా చేసి రివేంజ్ తీర్చుకున్నానని ప్రకటించింది. దీనిపై ముకేశ్ కూడా సానుకూలంగానే స్పందిస్తూ, దేబ్జానీ కుటుంబ సభ్యులు వస్తే తానే వెళ్లి స్వాగతిస్తానని చెప్పాడు.

Also Read:రామాయణంపై జక్కన్న ప్రశంసలు

చివరగా వంశీ, దేబ్జానీ, శ్వేత, త్రిగుణ్ నామినేషన్ల నుంచి సేవ్ అయ్యారు. మొత్తంగా ఫ్యామిలీ వీక్ ట్విస్టులు, రివేంజ్ గేమ్స్‌తో 60వ రోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా ముగిసింది.

- Advertisement -