బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. కొత్త టాస్కులు, ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తోంది. నవంబర్ 2న ప్రసారమైన 57వ రోజు ఎపిసోడ్‌లో నామినేషన్ల ప్రక్రియ హౌస్‌లో వేడిని పెంచింది. ఈ వారం రివార్డ్ అండ్ రివెంజ్ పేరుతో నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించిన బిగ్‌బాస్.. ఇంటి సభ్యులకు ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. అయితే కెప్టెన్ త్రిగుణ్‌కు మాత్రం నామినేషన్ల నుంచి మినహాయింపు ఇచ్చారు.
ముందుగా వంశీ తన నామినేషన్లను ప్రారంభించాడు. ముకేశ్‌ను నామినేట్ చేస్తూ అతడి మాటతీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఝాన్సీని బాధపెట్టేలా మాట్లాడటం, హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికాడు. మరోవైపు వర్షిణిని నామినేట్ చేస్తూ రాత్రిపూట ఇతరులకు నిద్రాభంగం కలిగించడం, పాత విషయాలను మనసులో పెట్టుకోవడంపై ప్రశ్నించాడు.
సుధీర్ తన నామినేషన్లలో వంశీ, అమన్‌లను ఎంచుకున్నాడు. డబ్బు కంటే పేరుకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పిన వంశీ.. గతంలో డబ్బులిచ్చి ఉంటే వెళ్లిపోయేవాడినని చెప్పడంపై ప్రశ్నించాడు. అమన్‌ను నామినేట్ చేస్తూ రోహిత్ విషయంలో అతడు తీసుకున్న నిర్ణయం స్నేహానికి విరుద్ధంగా ఉందని అభిప్రాయపడ్డాడు.
శ్వేత ముకేశ్, అమన్‌లను నామినేట్ చేసింది. బాల్ టాస్క్‌లో ముకేశ్ ప్రవర్తన, అతడి అగ్రెషన్ తనకు నచ్చలేదని చెప్పింది. హోటల్ టాస్క్‌లో మాట ఇచ్చి నిలబెట్టుకోలేదంటూ అమన్‌ను నిలదీసింది. నీతూ మాస్టర్ వర్షిణి, వంశీలను నామినేట్ చేసింది.
Also Read:రాహుల్ కోసమే RR ట్యాక్స్:అమిత్ షా
ఇక ముకేశ్ తన మొదటి నామినేషన్ వంశీకి వేస్తూ అతడి గేమ్ జీరో అని, త్రిగుణ్‌కు పప్పెట్‌లా ఆడుతున్నాడని విమర్శించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. వంశీ కూడా ముకేశ్‌కు ఘాటుగా సమాధానమిచ్చాడు. అనంతరం దేబ్జానీని నామినేట్ చేశాడు. రామకృష్ణ ముకేశ్, నీతూ మాస్టర్‌లను నామినేట్ చేయగా.. నరేశ్ అమన్, వర్షిణిలను ఎంచుకున్నాడు. హోటల్ టాస్క్‌లో జరిగిన పరిణామాలు, ఫొటో జరిపిన విషయంపై నరేశ్, వర్షిణి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇలా నామినేషన్ల ప్రక్రియలో ఆరోపణలు, ప్రత్యారోపణలతో 57వ రోజు ఎపిసోడ్ ముగిసింది.

