బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 10 తెలుగు విజయవంతంగా 51 రోజులు పూర్తి చేసుకుంది.ఇక ఎనిమిదో వారం నామినేషన్స్ ప్రక్రియ హాట్‌హాట్‌గా సాగింది. అక్టోబర్ 27న ప్రసారమైన 52వ ఎపిసోడ్లో త్రిగుణ్, వర్షిణి మధ్య ఎమోషనల్ డ్రామా కొనసాగగా.. ముకేష్ గౌడ తన వాదనలతో ఇంట్లో రచ్చ చేశాడు. చివరికి ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో నిలిచారు.
వర్షిణిని నామినేట్ చేయడంపై త్రిగుణ్ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన కుటుంబం కోసమే షోకు వచ్చానని చెప్పాడు. మరోవైపు వర్షిణి కూడా త్రిగుణ్ తనను అర్థం చేసుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. వీరిద్దరి సంభాషణతో ఎపిసోడ్లో డ్రామా కొనసాగింది.
రెండో దశ నామినేషన్స్‌లో గోట్ లెవల్ సభ్యులు ముకేష్, త్రిగుణ్, అమన్, దేబ్జానీ, నీతూ జడ్జీలుగా వ్యవహరించారు. ఎల్లో లెవల్ సభ్యుల్లో ముగ్గురికి నామినేషన్ చేసే అవకాశం కల్పించేందుకు వాదనలు జరిగాయి. తొలుత నీతూను పర్మినెంట్ జడ్జీగా ఎంపిక చేయగా, తర్వాత అమన్ ఆ బాధ్యతలు చేపట్టాడు.
నరేష్ వర్షిణి, ఝాన్సీలను నామినేట్ చేశాడు. టాస్కులు సరిగా ఆడటం లేదని వర్షిణిపై ఆరోపణలు చేయగా, తనకు ఇటీవలే సర్జరీ జరిగిందని ఆమె సమాధానమిచ్చింది. అనంతరం శివ.. వంశీ, సుధీర్లను నామినేట్ చేశాడు. సుధీర్‌ను సేఫ్ గేమ్ ఆడుతున్నాడంటూ విమర్శించగా, ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. జడ్జీల నిర్ణయంతో వంశీకి బదులుగా సుధీర్ నామినేషన్లోకి వచ్చాడు.
Also Read:షారుఖ్ ‘కింగ్’ కాపీనా?
రాంప్రసాద్ శివ, శ్వేతలను నామినేట్ చేయగా.. జడ్జీలు శివను ఎంపిక చేశారు. రెడ్ లెవల్ నుంచి రోహిత్ నరేష్‌ను, రామకృష్ణ వర్షిణిని నామినేట్ చేశారు. ఝాన్సీ శివను, శ్వేత ఝాన్సీని నామినేట్ చేయడంతో ఝాన్సీ కూడా నామినేషన్లోకి వచ్చింది.
ఇదిలా ఉండగా, నామినేషన్ల సమయంలో ముకేష్ ఇతరుల వాదనల్లో పదేపదే జోక్యం చేసుకోవడంతో శివ, నీతూ సహా పలువురితో వాగ్వాదం జరిగింది. చివర్లో బిగ్‌బాస్ సూచనలను సరిగ్గా వినలేదంటూ ముకేష్‌కు క్లాస్ పడింది. అనంతరం జడ్జీల నిర్ణయంతో వంశీని డైరెక్ట్‌గా నామినేట్ చేశారు.
మొత్తంగా ఈ వారం వంశీ, సుధీర్, రాంప్రసాద్, వర్షిణి, శివ, ఝాన్సీ, రోహిత్, రామకృష్ణ నామినేషన్స్‌లో నిలిచారు.

