బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 10 తెలుగు విజయవంతంగా 31 రోజులు పూర్తి చేసుకుంది. తాజాగా 32వ ఎపిసోడ్లో హౌస్‌లో మరోసారి రచ్చ జరిగింది. ముఖ్యంగా రోహిత్, షాలినీ, అపూర్వ మధ్య జరిగిన గొడవ హైలైట్‌గా నిలిచింది. మరోవైపు నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లకు సేఫ్ అయ్యేందుకు బిగ్ బాస్ ఓ అవకాశాన్ని ఇచ్చాడు.
నామినేషన్స్ ముగిసిన తర్వాత కంటెస్టెంట్లు తమకు వచ్చిన పాయింట్లపై చర్చించుకున్నారు. ఝాన్సీ ఇమ్యూనిటీ అవకాశాన్ని వదులుకుని డ్యాగర్లను త్యాగం చేసిందని అపూర్వ చెప్పగా.. ఆమెతో రోహిత్, అమన్, చరణ్ కూడా చర్చించారు. ఈ విషయాలను తిరిగి నామినేషన్స్‌లో ప్రస్తావిస్తారని రోహిత్ చెప్పడంతో అక్కడ ఆసక్తికరమైన చర్చ జరిగింది.
మరోవైపు వర్షిణి తన వ్యక్తిగత జీవితాన్ని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయింది. తన జీవితంలో దొరకని తండ్రి ప్రేమను ముకేష్లో చూస్తున్నానని, అది లవ్ ట్రాక్ కాదని త్రిగుణ్‌తో చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.
ఇదిలా ఉండగా.. నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లకు సేఫ్ అయ్యే టాస్కులను బిగ్ బాస్ ప్రకటించాడు. ఎండిపోయిన చెట్టు నుంచి వికసించిన చెట్టుపైకి తమ ఫొటోను తీసుకెళ్లాల్సి ఉంటుందని తెలిపాడు. ప్రేక్షకుల ఓట్లతో పాటు టాస్కుల్లో సాధించే విజయాలు కూడా ఎలిమినేషన్‌పై ప్రభావం చూపుతాయని స్పష్టం చేశాడు. దీంతో కంటెస్టెంట్లు జోడీలుగా విడిపోయి టాస్కుల్లో పాల్గొన్నారు.
ఈ సమయంలో అపూర్వ, షాలినీ మధ్య మరోసారి వివాదం చెలరేగింది. తమ గ్రూపులోకి అపూర్వను ఆహ్వానించడం లేదని షాలినీ అసహనం వ్యక్తం చేసింది. గతంలో శ్రిష్టితో తనకు గొడవలు రావడానికి అపూర్వే కారణమని ఆరోపిస్తూ ప్రశ్నించింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సుధీర్‌తో పెళ్లి గురించి అపూర్వ గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తావనకు రావడంతో ఆమె ఎమోషనల్ అయింది.
Also Read:దుబాయ్ బతుకమ్మ వేడుకలకు బీఆర్ఎస్ బృందం
మొదటి టాస్కులో అపూర్వ, చరణ్ జోడీ విజయం సాధించి మొదటి స్థానంలో నిలిచింది. త్రిగుణ్-అమన్ రెండో స్థానంలో, ముకేష్-ఝాన్సీ మూడో స్థానంలో నిలిచారు. నరేష్-రామ్ ప్రసాద్ తర్వాతి స్థానంలో ఉండగా.. రోహిత్-షాలినీ జోడీ చివరి స్థానానికి చేరుకుంది. దీంతో వారి సేఫ్టీపై ఉత్కంఠ నెలకొంది. ఇక నరేష్ తనదైన కామెడీతో నవ్వులు పూయించగా.. నరేష్, వర్షిణి చేసిన ‘టైటానిక్’ స్పూఫ్ ఎపిసోడ్‌కు ఫన్ జోడించింది.

