బిగ్ బాస్ ఇంట్లో మూడో వారం నామినేషన్ల ప్రక్రియ తీవ్రస్థాయికి చేరింది. ఇప్పటివరకు తమ మనసులో దాచుకున్న కోపాన్ని, అసహనాన్ని కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా బయటకు కక్కుతున్నారు. ఈ వారం నామినేషన్లలో ప్రధానంగా ముగ్గురి పేర్లు, కొన్ని ఊహించని గొడవలు హైలైట్‌గా నిలిచాయి.
ఈ వారం నామినేషన్లలో త్రిగుణ్ ప్రధాన టార్గెట్‌గా మారినట్లు కనిపిస్తోంది. సుధీర్, వర్షిణి, ముఖేష్‌లు ఒక టీమ్‌గా త్రిగుణ్‌ను నామినేట్ చేసేందుకు సిద్ధమయ్యారు.
వంశీ నామినేషన్ & కిచెన్ గొడవ: కిచెన్‌లో ఆయిల్ విషయంపై వంశీ గట్టిగా అరవడం, దానికి వర్షిణి ఏడవడంతో రామ్ ప్రసాద్ తీవ్రంగా స్పందిస్తూ వంశీని నామినేట్ చేశాడు.
షాలినీ వర్సెస్ వర్షిణి: “స్క్రీన్ పై కనిపించడానికే లేని పర్సనాలిటీని క్రియేట్ చేసుకుంటున్నావ్, ఫేక్‌గా ఉన్నావ్” అని వర్షిణి అనగా, “అది మీ పర్స్పెక్టివ్, నాకు డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్నాయి” అని షాలినీ తిప్పికొట్టింది.
సుధీర్ వర్సెస్ త్రిగుణ్ రచ్చ: త్రిగుణ్ ఒక మానిప్యులేటర్ అని, వెనుక నుంచి పొడుస్తాడని సుధీర్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దానికి త్రిగుణ్ స్పందిస్తూ “నాకు ధైర్యం ఉంటే ముందే చెప్తా” అని గట్టిగా అరిచాడు. “నేను స్టేజ్ ఎక్కి మరీ పొడుస్తా.. నీలా రూమ్‌లో పొడవను” అంటూ సుధీర్ సవాల్ విసరడంతో ఈ వారం నామినేషన్లు రసవత్తరంగా మారాయి.
‘అరుణ్ అదిత్’ ఎలా ‘త్రిగుణ్’ అయ్యాడు? పెళ్లి వెనుక ఉన్న కన్నీటి కథ!
బిగ్ బాస్ హౌస్‌లో త్రిగుణ్ పేరు మారుమోగుతుండటంతో ఆయన వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
చెన్నై టు టాలీవుడ్: త్రిగుణ్ అసలు పేరు అదిత్ అరుణ్. ఈయన స్వస్థలం చెన్నై. 2009లో జెనీవియాతో కలిసి ‘కథ’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 24 కిసెస్, గరుడ వేగ, డియర్ మేఘా, మరియు ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన కొండా వంటి చిత్రాల్లో నటించాడు.
Also Read:ఇరుముడి..రూ.250 కోట్ల క్లబ్‌లోకి!
పేరు మార్పు: రామ్ గోపాల్ వర్మతో సినిమా చేసిన తర్వాత శివుడి నామంతో తన పేరును త్రిగుణ్‌గా మార్చుకున్నాడు. పేరు మార్చాక లవర్ బాయ్ ఇమేజ్ మారి దాదాపు 10 సినిమాలు సాధించినట్లు తెలిపాడు.
తల్లి కోరిక & సైలెంట్ మేరేజ్: 2023 సెప్టెంబర్ 2న తమిళనాడులోని తిరుప్పూర్ శ్రీ సెంథూర్ మహల్లో నివేదిత అనే ఆర్కిటెక్ట్‌ను వివాహం చేసుకున్నాడు. వీరిది ప్రేమ వివాహమే అయినప్పటికీ చాలా సింపుల్‌గా జరిగింది. దానికి కారణం పెళ్లికి కొద్దిరోజుల ముందే ఆయన తల్లి కన్నుమూయడమే. అమ్మ కోరిక మేరకే ఆర్కిటెక్చర్ పనిలో పరిచయమైన నివేదితను, అమ్మ జ్ఞాపకార్థం ఆర్భాటాలు లేకుండా అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నానని త్రిగుణ్ తెలిపాడు.

