BB10:చరణ్ రీ-ఎంట్రీతో!

4
- Advertisement -

బిగ్ బాస్ సీజన్ రోజురోజుకూ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. 11వ రోజు ఆట ‘ఊ అంటావా మావా’ పాటతో ఫుల్ జోష్ మధ్య ప్రారంభమైంది. డ్యాన్స్ ఫ్లోర్‌పై వర్షిణి వేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత హౌస్‌మేట్స్ మధ్య చర్చలు, విభేదాలు, కొత్త వ్యూహాలతో వాతావరణం వేడెక్కింది.

కిచెన్ ఏరియాలో సుధీర్ పనులు చేస్తున్న తీరుపై షాలిని, సృష్టి, రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుధీర్ ఉదయాన్నే లేచి పనులు చేసుకోవడం, అందరినీ ఆప్యాయంగా చూసుకోవడం అతనికి ‘జెంటిల్ మ్యాన్’ ఇమేజ్‌ని తెచ్చిపెట్టిందని షాలిని పొగిడింది. అయితే, రోహిత్ మాత్రం దీనిపై కాస్త అసహనం వ్యక్తం చేశాడు. మరోవైపు, టెంపర్ వంశీ ప్రవర్తనపై తీవ్ర చర్చ నడిచింది. గతంతో పోలిస్తే వంశీ సైలెంట్‌గా ఉన్నాడని సృష్టి అనగా, కావాలనే అందరి విషయాల్లో వేలు పెడుతూ ట్రిగ్గర్ చేస్తున్నాడని రోహిత్ విమర్శించాడు.

వంటగదిలో ఆయిల్ వినియోగంపై వంశీ మాట్లాడిన తీరు వివాదానికి దారితీసింది. వర్షిణి, సుధీర్, ముకేష్‌ కలిసి రామ్ ప్రసాద్‌తో ఆయిల్ గురించి మాట్లాడుతుండగా, వంశీ జోక్యం చేసుకుని వంకర మాటలు మాట్లాడాడు. దీంతో మనస్తాపం చెందిన వర్షిణి భోజనం చేసే సమయంలో ఇలా మాట్లాడటం సరైంది కాదంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

తన మాట గెలవడం కోసం ఎంతటి వ్యూహానికైనా సిద్ధపడే త్రిగుణ్, ఈసారి రోహిత్‌తో సంధి చేసుకునేందుకు ప్రయత్నించాడు. “మనిద్దరం స్ట్రాంగ్ ప్లేయర్స్, మిగిలిన వాళ్లు మన వెనుక షెల్టర్ తీసుకుంటున్నారు. మనిద్దరం కలిస్తే ఎదురుండదు” అంటూ రోహిత్‌ను ఒప్పించే ప్రయత్నం చేశాడు. ఈ వారం ఇద్దరం ఒకరికొకరు వ్యతిరేకంగా మాట్లాడకూడదనే స్ట్రాటజీని తెరపైకి తెచ్చాడు.

ఈ ఎపిసోడ్‌లోనే బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఎలిమినేట్ అయిన చరణ్, రాక్షసుల గెటప్‌లో హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. ‘పవర్ ఆఫ్ ది పీపుల్’ ద్వారా ప్రేక్షకులు తనకు ఇచ్చిన రెండో అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటానని చరణ్ స్పష్టం చేశాడు.

హౌస్‌లోకి వచ్చిన చరణ్‌కు బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చారు. ఇప్పటికే కెప్టెన్సీ రేస్‌లో గెలిచిన రామ్ ప్రసాద్, త్రిగుణ్‌లలో ఒకరికి ఛాలెంజ్ విసిరే అవకాశం దక్కింది. ఎవరి మాటా వినని త్రిగుణ్‌ను కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించడమే లక్ష్యంగా చరణ్ అతనితో ఛాలెంజ్‌కి దిగాడు. ఈ టాస్క్‌లో చరణ్ స్మార్ట్‌గా ఆడటానికి ప్రయత్నించినప్పటికీ, బిగ్ బాస్ నిబంధనలను పాటించకపోవడంతో త్రిగుణ్ విజేతగా నిలిచాడు. దీంతో త్రిగుణ్ తన కెప్టెన్సీ కంటెండర్ స్థానాన్ని భద్రపరుచుకున్నాడు.

Also Read:పిల్లలలో డెంగ్యూ..అపోహలపై క్లారిటీ

- Advertisement -