BB10:నామినేషన్స్ రచ్చ

1
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 10 తెలుగు విజయవంతంగా 8 రోజులు పూర్తి చేసుకుంది. సోమవారం కావడంతో నామినేషన్స్ ప్రక్రియ అంటేనే హౌస్‌లో మంటలు పుట్టించే ఘట్టం. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియను బిగ్ బాస్ మరింత ఆసక్తికరంగా మార్చారు. అందరికీ నేరుగా నామినేట్ చేసే అవకాశం ఇవ్వకుండా ‘రోప్ అండ్ ఎక్స్’ (తాళ్లు విడిపించి గొడ్డలి పట్టుకోవడం) టాస్క్ ద్వారా అర్హత సాధించిన వారికే నామినేషన్ పవర్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో ఓడిపోయిన వారు నేరుగా నామినేట్ అవ్వగా, గెలిచిన వారు ఇద్దరిని నామినేట్ చేసే ఛాన్స్ పొందారు.

ఈ నామినేషన్స్ వ్యవహారంలో ప్రధానంగా టార్గెట్ అయింది మాత్రం త్రిగుణ్. హౌస్‌లో హోస్ట్ నాగార్జున, బిగ్ బాస్ సపోర్ట్ ఉందనే ధీమాతో తన ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్న త్రిగుణ్‌కు, ఈసారి హౌస్‌మేట్స్ గట్టి షాకే ఇచ్చారు. మాటలు మార్చడం (ఫ్లిప్పింగ్), ప్రతి విషయంలోనూ సోది పెట్టడం, ఇతరులపై పర్సనల్ కామెంట్స్ చేయడం వంటి కారణాలతో అతడిని వరుసగా నామినేట్ చేశారు.

ముఖ్యంగా సుధీర్, త్రిగుణ్ డబుల్ గేమ్‌ను పాయింట్ టు పాయింట్ ఎండగట్టాడు. “నువ్వు గోడ మీద పిల్లివి.. ప్రతి గ్రూప్‌లోనూ దూరుతూ మళ్లీ ఇతరులపై నిందలు వేస్తావు” అని సూటిగా కౌంటర్లు ఇవ్వడంతో త్రిగుణ్ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలాడు. రోహిత్ సైతం త్రిగుణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. జాతీయ టెలివిజన్ వేదికగా “స్టెరాయిడ్స్ బాడీ” అంటూ పర్సనల్ ఎటాక్ చేయడమే కాకుండా, ఆడపిల్లల గురించి నీచమైన వ్యాఖ్యలు చేశావంటూ త్రిగుణ్ ముసుగు తీసేశాడు.

ఇక మరోవైపు ఝాన్సీ సేఫ్ గేమ్‌ను కూడా హౌస్‌మేట్స్ తీవ్రంగా తప్పుపట్టారు. రోహిత్, అమన్ ఇద్దరూ ఆమె అభిప్రాయాలు స్పష్టంగా ఉండట్లేదని, అవసరాన్ని బట్టి మాటలు మారుస్తోందని నామినేట్ చేశారు. దానికి ఝాన్సీ “నా పవర్ ఏంటో చూపిస్తా” అంటూ శపథాలు చేసింది.

ఈ నామినేషన్ల ప్రక్రియ ముగిసేసరికి టాస్కుల్లో గెలిచి నామినేట్ చేయకుండా తప్పించుకున్న అమన్, వంశీ, నరేష్ మినహా మిగిలిన కంటెస్టెంట్లు – త్రిగుణ్, షాలిని, ఝాన్సీ, దేబ్జానీ, రాం ప్రసాద్, ముఖేష్, కృష్ణుడు, సుధీర్, సృష్టి, వర్షిణి, రోహిత్‌లు ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్స్‌లో నిలిచారు. త్రిగుణ్ నైజం పూర్తిగా బయటపడటంతో ఈ వారం నామినేషన్స్ ఎపిసోడ్ అత్యంత ఆసక్తికరంగా సాగింది.

Also Read:వినాయక చవితి..స్పెషల్ వంటకాలు

- Advertisement -