బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 10 తెలుగు విజయవంతంగా నాలుగు రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ త్రిగుణ్ ప్రవర్తించిన తీరు, చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణంగా మారాయి. హౌస్‌లో ప్రశాంతంగా ఉండే రోహిత్‌ని టార్గెట్ చేస్తూ, అతని పట్ల దిగజారి ప్రవర్తించడం ప్రేక్షకులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.
గతంలో సీజన్ 8లో గౌతమ్, యావర్ బాడీపై ఇండైరెక్ట్‌గా స్టెరాయిడ్స్ కామెంట్స్ చేసినప్పుడు నాగార్జున వీకెండ్ వార్నింగ్ ఇచ్చారు. కానీ ఈ పదో సీజన్‌లో త్రిగుణ్ ఏకంగా హద్దులు దాటి రోహిత్‌ను వ్యక్తిగతంగా తీవ్రంగా కించపరిచాడు.రోహిత్‌కు గిన్నెలు కడిగే డ్యూటీ పడగా, ప్రతి అరగంటకోసారి వచ్చి చూసుకోవాలంటూ త్రిగుణ్ వింత రూల్స్ పెట్టాడు. రోహిత్ ఒప్పుకుని పనులు చేస్తుంటే, కావాలనే ప్రశాంతతను దెబ్బతీసేలా ప్రవర్తించాడు. కుక్కర్ స్క్రూ బిగించే క్రమంలో “బట్టీ పట్టి 90 శాతం మార్కులు తెచ్చుకోవడం కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి” అంటూ రోహిత్ ఎడ్యుకేషన్‌పై చురకలు వేయడం స్టార్ట్ చేశాడు.
దానికి రోహిత్ సమాధానమిస్తుంటే, త్రిగుణ్ నియంత్రణ కోల్పోయి నేరుగా పర్సనల్ ఎటాక్‌కు దిగాడు. కోట్లాది మంది చూసే నేషనల్ టెలివిజన్‌లో రోహిత్‌ని ఉద్దేశించి “నీది స్టెరాయిడ్స్ ఎక్కించుకున్న బాడీ.. బయటకి చూస్తే అంతా డొల్ల. పోరా పిల్లబచ్చా.. డొల్లా రాజా” అంటూ అత్యంత నీచంగా మాట్లాడాడు.
అయినప్పటికీ రోహిత్ ఎంతో హుందాగా, సహనంతో ఆ పరిస్థితులను ఎదుర్కొన్నాడు. బాడీ షేమింగ్ చేస్తూ స్టెరాయిడ్ బాడీ అని అనడంపై రోహిత్ మరో కంటెస్టెంట్ చరణ్ దగ్గర ఆవేదన వ్యక్తం చేశాడు. వీటన్నింటికీ తోడు త్రిగుణ్ మళ్ళీ వర్షిణి దగ్గరకు వెళ్లి, రోహిత్ తన ప్రొఫెషన్‌ను, చదువును కించపరిచాడంటూ మాటలు తిప్పేసి చెప్పడం అతని ద్విముఖ వైఖరిని స్పష్టం చేస్తోంది.
ఒకరి బాడీ బిల్డింగ్‌ను, వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ త్రిగుణ్ చేసిన ఈ వ్యాఖ్యలు నియమావళికి విరుద్ధం. పిల్లబచ్చా , డొల్లా రాజా , స్టెరాయిడ్ బాడీ అంటూ హద్దులు దాటి ప్రవర్తించిన త్రిగుణ్‌కు ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
Also Read:అసెంబ్లీ ఘటనపై ఢిల్లీకి బీఆర్‌ఎస్ బృందం

