BB10:ఎలిమినేషన్‌పై నాగ్ సర్‌ప్రైజ్!

1
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 10 తెలుగు విజయవంతంగా 9 వారాలు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా 63వ రోజు ఎలిమినేషన్‌పై నాగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. అదిరిపోయే పాటతో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జునకు కంటెస్టెంట్స్ ప్రత్యేకంగా స్వాగతం పలికారు. దీపావళి శుభాకాంక్షలు చెబుతూ నీతూ, శ్వేత, త్రిగుణ్, వర్షిణి, అమన్, దేబ్జానీ, నరేశ్, రాంప్రసాద్, శివ, వంశీ కలిసి డ్యాన్స్ చేశారు. అనంతరం ముకేశ్‌ను నాగార్జున సేవ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

తర్వాత ముకేశ్‌కు తన అభిమాని నుంచి సందేశం వినిపించారు. అనంతరం దేబ్జానీతో జరిగిన బ్లాక్ కోతి వివాదంపై చర్చించారు. తన రంగును ఉద్దేశించి దేబ్జానీ అలా మాట్లాడటం బాధించిందని ముకేశ్ చెప్పాడు. నాగార్జున వీడియో చూపించి ఇంటి సభ్యుల అభిప్రాయాలు అడిగారు. వర్షిణి, నరేశ్ దేబ్జానీ తప్పు చేసిందని అభిప్రాయపడగా, నీతూ మాత్రం కావాలని అన్నట్లు అనిపించలేదని చెప్పింది. చివరకు ముకేశ్, దేబ్జానీ ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకున్నారు.

అనంతరం హౌస్‌ను ముకేశ్, దేబ్జానీ టీమ్స్‌గా విభజించి సినిమా పేర్లు, హీరోల పేర్లు చెప్పే గేమ్ నిర్వహించారు. ఇందులో ముకేశ్ టీమ్ విజయం సాధించింది. తర్వాత నరేశ్, రాంప్రసాద్ సేవ్ అయ్యారు.మరో గేమ్‌లో ఇంటి సభ్యులు ఒకరిపై మరొకరు సెటైరికల్ టైటిల్స్ ఇచ్చుకున్నారు. దేబ్జానీకి ‘ఫేస్ ఒకటి.. వెర్షన్ ఇంకొటి’, నరేశ్‌కు ‘డ్రామాకి డైలీ డోస్’, నీతూకి ‘ఫస్ట్ వీక్ ఫైర్.. నెక్స్ట్ వీక్ ఎక్స్‌పైర్’ వంటి టైటిల్స్ ఇచ్చి సందడి చేశారు. అనంతరం వర్షిణి సేవ్ అయింది.

ఇక ‘ఇట్లు అర్జున’ సినిమా ప్రమోషన్స్ కోసం హీరో అనీష్, హీరోయిన్ అనస్వర హౌస్‌లోకి వచ్చారు. నవంబర్ 13న సినిమా విడుదల కానుందని వెల్లడించారు. అనంతరం ఫ్యామిలీ వీక్ కోసం ప్రత్యేక టాస్క్ నిర్వహించారు. నరేశ్, రామకృష్ణ, వర్షిణిలలో ఒకరికి కుటుంబ సభ్యులను కలిసే అవకాశం కల్పించేందుకు మిగతా సభ్యులు తమ బరువును త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ పోటీలో నరేశ్‌కు 22 కిలోలకు పైగా బరువు రావడంతో ఫ్యామిలీ వీక్ అవకాశం దక్కింది. వర్షిణికి 13 కిలోలు, రామకృష్ణకు కేవలం కేజిన్నర మాత్రమే వచ్చాయి.

Also Read:‘దశావతారం’..రీ-రిలీజ్

చివరగా నామినేషన్లలో ఉన్న సుధీర్, నీతూ, శివల ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు. తొలుత శివ, ఆ తర్వాత నీతూ సేవ్ అయ్యారు. సుధీర్ కూడా ఎలిమినేషన్ నుంచి బయటపడ్డాడు. దీపావళి పండుగ సందర్భంగా ఈ వారం ఎవరినీ ఎలిమినేట్ చేయడం లేదని నాగార్జున ప్రకటించి అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. అయితే, ఇది చివరి అవకాశమని హెచ్చరించారు.

- Advertisement -