బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 59 హైలైట్స్

106
avinash

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 59 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. ఈ వారం ఎలిమినేషన్‌కి ఐదుగురు నామినేట్ కాగా అమ్మా రాజశేఖర్-అభిజిత్-హారిక మధ్య గొడవ ,సొహైల్ – అభిజిత్ మధ్య వాగ్వాదంతో ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది.

అభిజిత్ రెండో నామినేషన్‌గా మాస్టర్‌ని ఎంపిక చేయగా వీరిద్దరి మధ్య వాగ్వాదం కొనసాగింది. మాస్టర్ మీరు ఎదుటి వాళ్లని అంటారు కానీ.. తిరిగి అంటే రిసీవ్ చేసుకోలేరని తెలిపాడు అభిజిత్. తనని ఒంటికాలిపై నిలబెట్టిన విషయాన్ని గుర్తు చేసుకుని అసలు వాడెవడు నాకు పనిష్మెంట్ ఇవ్వడానికి అంటూ సీరియస్ అయ్యాడు మాస్టర్‌. మీరు చెప్పిందే తప్ప ఎదుటివారిని చెప్పనివ్వరు.. ఈ రీజన్‌తోనే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు అభిజిత్.దీంతో ఒకరినొకరు పరస్పరం దూషించుకున్నారు. నోయల్ మా పొట్టకొట్టడానికి ప్రయత్నించాడు….వాడ్ని నువ్ సపోర్ట్ చేస్తున్నావ్ అంటూ అమ్మా రాజశేఖర్ సీరయస్ అయ్యాడు. మధ్యలో అవినాష్ ప్రస్తావన రావడంతో అవినాష్ కూడా ఇన్వాల్వ్ కావడంతో రచ్చ రెట్టింపు అయ్యింది. తర్వాత హారిక ఎంటర్ కావడానికి ప్రయత్నించడంతో నువ్ నోర్ముయ్.. నీకేంటి సంబంధం అంటూ హారిక పై ఫైర్ అయ్యారు మాస్టర్.తర్వాత కూడా అభిజిత్-మాస్టర్‌ గొడవపడుతూనే ఉన్నారు.

అనంతరం నేను నామినేట్ చేయను.. వీళ్లంతా నన్ను బయటకు పంపడానికి ప్లాన్ చేశారు అంటూ అలిగి లోపలికి వెళ్లిపోయారు మాస్టర్. ఆ తరువాత సొహైల్, మెహబూబ్‌లు బ్రతిమాలి బయటకు తీసుకువచ్చారు. ఇక తర్వాత హారిక…అవినాష్‌,మాస్టర్‌లను నామినేట్ చేసింది. మాస్టర్ నామినేషన్ సందర్భంగా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది.

ఇక మోనాల్ వంతు రావడంతో గుడ్డు కొట్టడం ఇష్టం లేని మోనాల్ అవినాష్ హెల్ప్ తీసుకుంది. మొదటి గుడ్డును సొహైల్ తలపై కొట్టించింది. రెండో గుడ్డుని లాస్యపై కొట్టించింది మోనాల్. తర్వాత మాస్టర్….అభిజిత్,అఖిల్‌ని నామినేట్ చేయగా మెహబూబ్ ….హారిక,అవినాష్‌లను, అఖిల్…మోనాల్,మాస్టర్‌లను నామినేట్ చేశాడు. దీంతో అంతా షాక్‌కు గురయ్యారు.

మొత్తంగా హాట్ హాట్‌గా సాగిన నామినేషన్స్‌లో అవినాష్, రాజశేఖర్, అభిజిత్, హారిక, మోనాల్‌‌లు నామినేట్ అయ్యారు. తర్వాత ఇందులో నుండి సేవ్ అయ్యేందుకు ఒకరికి ఛాన్స్ ఉంటుందని తెలపగా ఆ టాస్క్‌లో అంతా విఫలమయ్యారు.