మొక్కలు నాటిన BB6 కంటెస్టెంట్‌ అర్జున్‌

90
- Advertisement -

తెలంగాణ టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ జోరుగా కొనసాగుతుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ప్రముఖులు మొక్కలు నాటి వాటిని ఏవిధంగా సంరక్షించాలో వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నటి శ్రీష కుమార్‌ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన బిగ్‌బాస్‌6 కంటెస్టెంట్‌ అర్జున్‌ కళ్యాణ్.

ఈ సందర్భంగా అర్జున్‌ కళ్యాణ్ మాట్లాడుతూ… గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లాంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. మొక్కలు నాటడం వల్ల మనసుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. భావితరాలకు మంచి ఆక్సీజన్‌ కావాలన్నా, అందరం ఆరోగ్యంగా ఉండాలన్నా మొక్కలు నాటి వాటిని సంరక్షించడం మన బాధ్యత అన్నారు. ప్రజలందరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని సూచించారు.

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనే అవకాశం ఇచ్చిన రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్‌జే సూర్య, వసంతి, బాలాదిత్య ముగ్గురిని మొక్కలు నాటాలని సవాళ్లు విసిరారు.

ఇవి కూడా చదవండి..

BB6..ఆసక్తికంగా సూర్య-ఇనయ ట్రాక్

సమంతకు సోకిన వ్యాధి ప్రమాదకరమా ?

స్విమ్ సూట్ లో రకుల్ అందాలు అదరహో

- Advertisement -