బిగ్ బాస్ 3 ఎప్పుడో తెలుసా?

258
Big-Boss-3-Promo
- Advertisement -

బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో త్వరలోనే బిగ్ బాస్ 3 సీజన్ ను కూడా ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే బిగ్ బాస్ 3కి హోస్ట్ గా నాగార్జున వ్యవహరించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో ప్రొమో ను విడుదల చేసింది బిగ్ బాస్ టీం.

ఇక ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ షో ప్రారంభానికి సంబంధించి ట్వీట్టర్ ద్వారా తెలియజేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. బిగ్ బాస్ 3 కార్య‌క్ర‌మం సీజ‌న్ 3 జూలై 21 నుండి టెలికాస్ట్ చేయ‌నున్న‌ట్లు ప్రకటించారు. 24 గంట‌లు, 64 కెమెరాల మ‌ధ్య 16 మంది కంటెస్టెంట్స్ చేసే హంగామాతో ఇక బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ఫుల్ ఫ‌న్ దొరుకుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. బిగ్ బాస్ హౌస్‌లో యాక్టింగ్ కాదు.. ఓన్లీ రియాలిటీనే ఉంటుంద‌ని నాగ్ ప్రోమోలో తెలిపాడు.

- Advertisement -