బిగ్ బాస్ 3 హోస్ట్ గా చిరంజీవి..

216
bigboss chiranjeevi
- Advertisement -
బుల్లి తెర‌పై ప్ర‌సార‌మ‌య్యే రియాలిటీ షో బిగ్ బాస్ మంచి స‌క్సెస్ ను సాధించింది. దీంతో సిజ‌న్1, సిజ‌న్2 ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ 1ను ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌గా, బిగ్ బాస్ 2కు హీరో న్యాచుర‌ల్ స్టార్ నాని వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈషో మూడవ సీజ‌న్ ను చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.  ‘బిగ్ బాస్ 2’ కి హోస్ట్ గా వ్యవహరించే సమయంలో నాని కొన్ని విమర్శలను ఎదుర్కున్నాడు.
big boss ntr
అందువ‌ల్ల ఆయ‌న బిగ్ బాస్ 3కి హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌మ‌ని అడ‌గ‌గా ఆయ‌న నో చెప్పాడ‌ని స‌మాచారం.  నాని నో చెప్ప‌డంతో వెంట‌నే హీరో వెంక‌టేశ్ ను సంప్ర‌దించార‌ట బిగ్ బాస్ టీం. ఇదిలా ఉండ‌గానే తెరపైకి మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా వినిపిస్తుంది. రీసెంట్ బిగ్ బాస్ నిర్వాహకులు చిరంజీవిని కలిసి ఆయనతో ఈ కార్యక్రమాన్ని గురించి చర్చలు జరిపారని సమాచారం.
Bigg-Boss-Telugu
చిరంజీవి గ‌తంలో ఇదే స్టార్ మా ఛానెల్లో మీలో ఎవ‌రూ కోటిశ్వ‌రుడు షో కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. చిరంజీవి ప్ర‌స్తుతం సైరా సినిమాలో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. చూడాలి మ‌రి చిరంజీవి, వెంక‌టేశ్ ఎవ‌రో ఒక‌రిని బిగ్ బాస్ 3లో వ్యాఖ్యాత‌గా పెట్టాల‌ని చూస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహ‌కులు.
- Advertisement -