- Advertisement -
మావోయిస్టులకు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అగ్రనేతలను కొల్పోయిన మావోయిస్టులకు తాజాగా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్‌లో కీలక నేత మృతి చెందారు. ఎదురుకాల్పుల్లో తెలంగాణకు చెందిన సెంట్రల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్, జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ మృతి చెందారు.
వీరి నుండి 3 ఏకే-47 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు చత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా దండకారణ్యంలో ప్రజాకోర్టు నిర్వహించారు మావోయిస్టులు. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా మారిన గ్రామస్తులను గుర్తించారు. పొదకొర్మ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు ఉరి వేశారు.
అలాగే ఏడుగురు గ్రామస్తులను చితకబాది, 12 మందిని కిడ్నాప్ చేశారు మావోయిస్టులు. మృతులు జింగు మోడియం, సోమ మోడియం, అనిల్ మండావిగా గుర్తించారు.
Also Read:రేణిగుంట విమానాశ్రయం పేరు మార్పు!
- Advertisement -

