కాంగ్రెస్ కు మరో షాక్… గోవాలో 10మంది ఎమ్మెల్యేల రాజీనామా

258
Goa Congres
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి గొడ్డు కాలం ఏర్పడగా..తాజాగా గోవాలో కూడా అదే పరిస్ధితి నెలకొంది. గోవాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 10మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీలో ఇంకా కేవలం 5గురు మాత్రమే మిగిలారు. అంతేకాకుండా తమను బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ ప్రతిపక్ష నేత చంద్రకాంత్‌ కవ్లేకర్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేలు స్పీకర్ రాజేశ్‌ పట్నేకర్‌ను కలిసి లేఖ ఇచ్చారు. మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు విలీనానికి ఓకే చెప్పడంతో కాంగ్రెస్ శాసనసభా పక్షం బీజేపీలో విలీనమైంది.

ప్రస్తుతం 17 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ గోవాలో అతిపెద్ద పార్టీగా ఉంది. గోవా ఫార్వర్డ్ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు,నేషనల్ కాంగ్రెస్ పార్టీ,మహారాష్ట్రవాది గోమాంతక్ పార్టీకి ఒక్కో ఎమ్మెల్యే చొప్పున ఉన్నారు. 10మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో ఆపార్టీ బలం 27కు చేరింది. కాగా ప్రస్తుతం గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు కేవలం 5గురు మాత్రమే ఉన్నారు.

- Advertisement -