మున్సిపల్ ఎన్నికలు.. బీజేపీకి అభ్యర్ధులు కావలెను

445
bjp-laxman-

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగరా మోగిన సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యాయి. నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తి కావడంతో పూర్తి స్దాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు అభ్యర్దులు. ఇక టీఆర్ఎస్ పార్టీలో టికెట్ల కోసం ఆశావాహులు పెద్ద ఎత్తున ఉండగా.. కాంగ్రెస్ లో కూడా అంతంత మాత్రమే అని చెప్పాలి. ఇక బిజేపీ సంగతి చెప్పనక్కర్లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నా రాష్ట్రంలో మాత్రం మున్సిపల్ ఎన్నికలకు అభ్యర్దులు దొరకడం లేదు. టీఆర్ఎస్ జోరును చూసి బీజేపీ నుంచి పోటీ చేయడానికి ఎవరు ధైర్యం చేయడం లేదు.

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మొత్తం 2727 వార్డులకు నిన్న నామినేషన్ల గడువు ముగిసిపోగా… దాదాపు 30 శాతం స్థానాల్లో పార్టీ తరపున అభ్యర్థులు నామినేషన్లు వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాల్లోనూ బీజేపీ తరపున పలు వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడంపై ఆయన క్లస్టర్ ఇంఛార్జ్‌లను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. తెలంగాణ లో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకునే బీజేపీ నేతలకు కనీసం వార్డుల్లో అభ్యర్దులు కూడా దొరకడం లేదు.