జానీ మాస్టర్‌కు షాక్

1
- Advertisement -

తెలుగు చిత్రసీమలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలతకు ఫిల్మ్ ఫెడరేషన్ ఊహించని షాక్ ఇచ్చింది. తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఉన్న సుమలత నేతృత్వంలోని ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.

అసోసియేషన్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు, పరిణామాల నేపథ్యంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఒక అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతతో పాటు డ్యాన్స్ మాస్టర్ రఘు (రఘు మాస్టర్) మరియు సుమారు 225 మంది డ్యాన్సర్లు హాజరయ్యారు.సమావేశంలో అసోసియేషన్ భవిష్యత్తు మరియు ప్రస్తుత నాయకత్వంపై సభ్యుల అభిప్రాయాలను సేకరించారు.

ఈ సమావేశంలో సభ్యుల మద్దతును లెక్కించగా సుమలతకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.హాజరైన 225 మంది డ్యాన్సర్లలో ఏకంగా 214 మంది డ్యాన్సర్లు రఘు మాస్టర్‌కు మద్దతు పలికారు.సుమలతకు కేవలం 11 మంది డ్యాన్సర్లు మాత్రమే మద్దతుగా నిలిచారు.మెజారిటీ సభ్యులు సుమలత కార్యవర్గంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో మరియు రఘు మాస్టర్ వైపే మొగ్గు చూపడంతో, ప్రస్తుతం ఉన్న సుమలత కార్యవర్గాన్ని వెంటనే రద్దు చేస్తున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు ప్రకటించారు.

అసోసియేషన్ కొత్త కార్యవర్గాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకునేందుకు గాను అక్టోబర్ 11న తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు నూతన ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ వెల్లడించింది. ఈ నిర్ణయంతో టాలీవుడ్ డ్యాన్స్ అసోసియేషన్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

Also Read:అనుమాన పక్షి..100% సర్‌ప్రైజ్ చేస్తుంది!

- Advertisement -