- Advertisement -
వైసీపీ అధినేత జగన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి మర్రి రాజశేఖర్ పార్టీలో కొనసాగుతున్నారు. 2014లో రాజశేఖర్ కు చిలకలూరిపేట టికెట్ ఇవ్వగా టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావుపై ఓటమిపాలయ్యారు.
2019లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి విడుదల రజని వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు మర్రి రాజశేఖర్.
ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీలో మర్రి రాజశేఖర్ కీలక నేతగా ఉన్నారు. అయితే, రాజశేఖర్ పార్టీని వీడి వెళ్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది.త్వరలో టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.
Also Read:RCB:న్యూ జెర్సీ..ఈసారైనా టైటిల్ గెలిచేనా?
- Advertisement -