సుప్రీంలో హైడ్రాకు బిగ్ షాక్

4
- Advertisement -

హైదరాబాద్‌లో చెరువుల రక్షణ, ఆక్రమణల తొలగింపే లక్ష్యంగా ముందుకుసాగుతున్న ‘హైడ్రా’ (HYDRA) మరియు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ నిర్మాణ సంస్థ శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్‌కు సంబంధించిన భూవివాదంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తీవ్రంగా తోసిపుచ్చింది.

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని లోతుకుంట వద్ద గల సర్వే నంబర్లు 1 మరియు 2లోని 40 ఎకరాల విలువైన భూమిపై గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వానికి, శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది. కంటోన్మెంట్ పరిధిలోని ఆ 40 ఎకరాల భూమి పూర్తిస్థాయిలో తెలంగాణ ప్రభుత్వానికే చెందుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

అయితే ఈ భూమికి సంబంధించి పూర్తి ఆధారాలు పరిశీలించిన తెలంగాణ హైకోర్టు.. సదరు స్థలం శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్‌కే చెందుతుందని గతంలో కీలక తీర్పు ఇచ్చింది.హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా, కేసును విచారించిన సుప్రీం ధర్మాసనం హైకోర్టు తీర్పులోనే ఎలాంటి జోక్యానికి నిరాకరిస్తూ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది (డిస్మిస్ చేసింది). దీనితో శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్‌కు ఆ భూమిపై పూర్తి హక్కులు ఉన్నాయని తేలిపోయింది.

ఇదే వివాదాస్పద భూమి విషయంలో హైడ్రా వ్యవహరించిన తీరుపై గతంలో తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను దిక్కరించేలా వ్యవహరించారనే ఆరోపణలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆ బాధ్యతల నుండి వెంటనే తొలగించాలని కూడా హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Also Read:చీమ లాగే వినాయకుడి రథం..

ప్రస్తుతం సుప్రీంకోర్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పిటిషన్‌ను డిస్మిస్ చేయడంతో హైడ్రా చర్యలకు మరియు ప్రభుత్వ వాదనలకు గట్టి షాక్ తగిలినట్లయింది.

- Advertisement -