చెన్నమనేనికి ఊరట…

187
Big relief for MLA Ramesh
- Advertisement -

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో ఊరట లభించింది. చెన్నమనేని భారతీయుడు కాదని ఆయన పౌరసత్వాన్ని కేంద్ర హోంశాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంను ఆశ్రయించిన చెన్నమనేనికి బిగ్ రిలీఫ్ లభించింది. కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసిన కోర్టు….  పౌరసత్వం రద్దుపై పునరాలోచించాలని  కేంద్ర హోంశాఖను ఆదేశించింది. రమేష్ అభ్యర్థనపై ఆరు వారాల్లోగా వివరణ ఇవ్వాలని సూచించింది.

చెన్నమనని రమేష్‌ 2014లో వేములవాడ నుంచి టీఆర్‌ఎస్‌ తరపున గెలిచారు. చెన్నమనేని రమేశ్ కు జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నందున ఆయన ఎన్నిక చెల్లదంటూ నాడు బీజేపీలో ఉన్న ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు రమేశ్ ఎన్నిక చెల్లదని, ఆయన భారత పౌరుడు కాదని 2013లో తీర్పు ప్రకటించింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ, చెన్నమనేని రమేశ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ తీర్పుపై సుప్రీం స్టే ఇచ్చింది.

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు,దివంగత మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్‌రావు కుమారుడు చెన్నమనేని రమేష్. ఆయన రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రమేష్…టీఆర్ఎస్‌లో క్రియాశీలకంగా ఉన్నారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌ రావు స్వయాన బాబాయ్ అవుతారు.

- Advertisement -