- Advertisement -
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ 2019లో మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు పిటిషన్ దాఖలు చేయగా ఆయన పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇవాళ దానిని కొట్టేసింది.
2018 ఎన్నికల సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం ఇచ్చారని రాఘవేంద్రరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్‌ను ఒకసారి రిటర్నింగ్ ఆఫీసర్‌కు సమర్పించిన తర్వాత మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది చట్ట విరుద్దమని శ్రీనివాస్ గౌడ్ ఎన్నికను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఇరు వర్గాల వాదనల విని ఇవాళ ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
Also Read:హ్యాపీ బర్త్ డే….దర్శకధీర రాజమౌళి
- Advertisement -