ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఊరట లభించింది. విచారణ అధికారి ముందు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే బెయిల్ షరతులను సడలించింది సుప్రీంకోర్టు ధర్మాసనం.
ఆప్ 20 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కొత్త ముఖాలకు టిక్కెట్లు ఇవ్వగా,13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టింది. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సీటును మార్చింది. ప్రతాప్ గంజ్ ఎమ్మెల్యేగా ఉన్న సిసోడియా ఈసారి జంగ్ పుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ప్రతాప్ గంజ్ నియోజకవర్గాన్ని ఇటీవలే పార్టీలో చేరిన విద్యావేత్త, పాపులర్ యూట్యూబర్ అవథ్ ఓఝాకు కేటాయించింది.
పార్టీ అభ్యర్థుల రెండో లిస్టులో జితేంద్ర సింగ్ ఘంటి, సరిందర్ పాల్ సింగ్ బిట్టు పేర్లు ఉన్నాయి. బిట్టు ఈమధ్యే బీజేపీ నుంచి ఆమ్ ఆద్మీలో చేరారు.
Also Read:Manchu Manoj:సారీ చెప్పిన మనోజ్