ఢిల్లీ లిక్కర్ స్కామ్..కేజ్రీవాల్‌కు భారీ ఊరట

8
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ నేత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఢిల్లీలోని హౌస్ రెవెన్యూ కోర్టు డిశ్చార్జ్ చేసింది. కేసుకు సంబంధించి తగిన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.

విచారణ సందర్భంగా సమర్పించిన పత్రాలు, సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం అభియోగాలను కొనసాగించేందుకు సరైన ప్రమాణాలు కనిపించలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. అందువల్ల కేజ్రీవాల్, సిసోడియాలపై నమోదైన ఆరోపణలను రద్దు చేస్తూ వారిని కేసు నుంచి విముక్తి కల్పించింది.

ఈ తీర్పుతో ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాల్లో ఆనందం వ్యక్తమైంది. పార్టీ నేతలు దీనిని “నిజానికి విజయం”గా అభివర్ణించారు.

లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మణీష్ సిసోడియా, మాజీ ఎమ్మెల్సీ కవిత సహా అందరి నిందితులకు విముక్తి లభించింది.

1. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు లిక్కర్ పాలసీ కేసులో  23 మంది నిందితులను విముక్తి చేసింది.

2. మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరియు ఆప్ నాయకుడు మణీష్ సిసోడియాకు డిశ్చార్జ్ మంజూరు.

3. ప్రత్యేక న్యాయమూర్తి జితేందర్ సింగ్ తీర్పు ఇచ్చారు.

4. సీబీఐ దర్యాప్తులో తీవ్రమైన లోపాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానం.

5. వేలాది పేజీల చార్జ్‌షీట్‌లో సాక్ష్యాలతో మద్దతు లేని అంశాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది.

6. చార్జ్‌షీట్‌లో “misleading averments” మరియు అంతర్గత విరుద్ధతలు ఉన్నాయని న్యాయమూర్తి వ్యాఖ్య.

7. మణీష్ సిసోడియాపై ప్రాథమిక కేసు నిలబడే ఆధారాలు లేవని కోర్టు స్పష్టం.

8. కేజ్రీవాల్‌ను సరైన ఆధారాలు లేకుండా కేసులో ఇరికించారని కోర్టు వ్యాఖ్యానం.

9. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం చట్టపరంగా సరైంది కాదని కోర్టు అభిప్రాయం.

10. ప్రధాన నిందితుడిగా పేర్కొన్న కుల్దీప్ సింగ్‌పై కూడా స్పష్టమైన ఆధారాలు లేవని కోర్టు వ్యాఖ్య.

11. సీబీఐ దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన విచారణకు కోర్టు ఆదేశం.

12. మణీష్ సిసోడియా సుమారు 530 రోజులు జైలులో ఉన్నారు.

13. అరవింద్ కేజ్రీవాల్ సుమారు 156 రోజులు జైలులో గడిపారు.

14. 2021 ఎక్సైజ్ పాలసీపై అక్రమాల ఆరోపణలతో సీబీఐ, ఈడీ దర్యాప్తు ప్రారంభమైంది.

15. పాలసీ ద్వారా ప్రైవేట్ సంస్థలకు అనుచిత లాభాలు కల్పించారని కేంద్ర దర్యాప్తు సంస్థల ఆరోపణలు.

Also Read:ఒత్తిడితో పురుషుల్లో సంతానోత్పత్తి సమస్య..!

- Advertisement -