- Advertisement -
అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులకు భారీ ఊరట దక్కింది. H1B వీసా ఫీజు పెంపు కేవలం అమెరికా బయట నుండి దరఖాస్తు చేసుకున్న వారికే వర్తిస్తుందని వెల్లడించింది.
ఈ విషయాన్ని స్పష్టం చేసింది అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్. H1B ఫీజు పెంచే సమయానికి అమెరికాలో ఉన్నవారికి మినహాయింపు వర్తిస్తుందని వెల్లడించింది. దీంతో ఇప్పటికే అమెరికాలో చదువుకుంటున్న, పని చేస్తున్న విద్యార్థులకు భారీ ఊరట దక్కనుంది.
గతంలో హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లకు పెంచి షాకిచ్చారు ట్రంప్. అయితే అక్కడి కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి రావడంతో.. ఇక మీదట ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయని నిపుణుల అంచనా వేసిన సంగతి తెలిసిందే.
Also Read:తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలు బంద్!
- Advertisement -

