- Advertisement -
మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో నలుగురు దోషులను బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు.
గాలి జనార్దన్ రెడ్డి, ఆయన పీఏ అలీఖాన్, బీవీ శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్‌కు బెయిల్ దక్కింది. అలాగే నలుగురికి విధించిన ఏడేళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేసింది తెలంగాణ హైకోర్టు.
ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు గాలి జనార్దన్ రెడ్డిని దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. గాలి జనార్దన్ రెడ్డి సహా ఐదుగురికి ఏడేండ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవి కొల్పోయారు.
Also Read:కేసీఆర్ జీవితమే ఓ చరిత్ర: కేటీఆర్
- Advertisement -

