ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు రిలీఫ్

39
- Advertisement -

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ లభించింది. అమరావతి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కేసులో సుప్రీం కోర్టులో చంద్ర‌బాబుకు ఊరట ల‌భించింది. చంద్ర‌బాబు ముంద‌స్తు బెయిల్ ర‌ద్దు చేయాలంటూ దాఖ‌లైన ఏపీ ప్ర‌భుత్వ పిటిష‌న్‌ను దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం కొట్టివేసింది.

హైకోర్టు అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే ఉత్త‌ర్వులు ఇచ్చింద‌ని సుప్రీం అభిప్రాయపడింది. కేసు ద‌ర్యాప్తుపై ముంద‌స్తు బెయిల్ ప్ర‌భావం ఉండ‌దని వెల్లడించింది. చంద్ర‌బాబుకు నోటీసులు ఇచ్చేందుకు నిరాక‌రించగా ఈ కేసులో జోక్యం చేసుకోలేమ‌ని వెల్ల‌డించింది.

Also Read:నితీశ్‌..ఏం చేసినా ప్రత్యేకమే!

- Advertisement -