తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బండి సంజయ్ కుమార్ పాదయాత్రతో బీజేపీలో వర్గపోరు భగ్గుమన్నది.పాలమూరులో ఆ పార్టీ నేతలు తన్నుకున్నారు.. బండి పాదయాత్రకు సంబంధించిన పోస్టర్లలో ఫొటోల విషయంలో ఇరువర్గాలు దాడి చేసుకొన్నాయి. దాడిలో పార్టీ భూత్పూర్ మండల అధ్యక్షుడికి తీవ్రగాయాలయ్యాయి.
ఎస్సై భగవంత్ రెడ్డి కథనం మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం పరిధిలోని భూత్పూర్ బీజేపీ మండలాధ్యక్షుడు బాల్‌రెడ్డి దేవరకద్ర పట్టణంలో బండి సంజయ్ యాత్రకు సంబంధించిన వాల్‌పోస్టర్లు అతికిస్తున్నాడు. వాల్‌పోస్టర్లలో ఫొటోల విషయంలో బాల్‌రెడ్డితో బీజేపీ దేవరకద్ర మండలాధ్యక్షుడు కొండ అంజన్‌కుమార్ రెడ్డి ఘర్షణకు దిగాడు. దేవరకద్రలోని ఆర్‌వోబీ కింద ఇరువర్గాలు పరస్పర దాడి చేసుకున్నాయి.
దాడిలో బాల్‌రెడ్డి తలకు, చేతికి బలమైన గాయాలయ్యా యి. అంజన్‌కుమార్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యా యి. కమలం పార్టీకి చెందిన ఇద్దరు మండల అధ్యక్షులు వీధి పోరాటానికి దిగడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. కాగా, గాయపడ్డ భూపాల్‌రెడ్డిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న భూత్పూర్ సీఐ రజిత సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారా లేదా అన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు ముందే దేవరకద్ర బీజేపీలో వర్గ పోరు చెలరేగడం పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది.