ఐపీఎల్ 2026 వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఎందుకంటే 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కనీసం ప్లే ఆఫ్స్‌కి కూడా చేరకుండా ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో ఆగ్రహంగా ఉన్న టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకా జట్టులో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు.
హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్‌తో పాటు టీమ్ కన్సల్టెన్సీ జహీర్ ఖాన్‌పై వేటు వేసేందుకు సిద్దమైంది. ఇప్పటికే బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్‌ను లక్నో నియమించుకుంది. జహీర్ ఖాన్ స్థానంలో కొత్త కన్సల్టెంట్ కోసం అన్వేషణ మొదలు పెట్టినట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి.
ఐపీఎల్ 2022 సీజన్‌లో లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్..ఇప్పటి వరకు 4 సీజన్లు ఆడింది. ఇందులో రెండు సార్లు ప్లే ఆఫ్స్ చేరింది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్‌తో పాటు జహీర్ ఖాన్ స్థానంలో ఎవర్నీ తీసుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
Also Read:సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

