బిగ్ బాస్ సీజన్ 4…షురూ

264
big boss

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమైంది. ప్రారంభంలో ఎప్పటిలాగే నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చి సినిమాల్లోని పాటలకు స్టెప్పులేశారు.

అయితే, ఈ షోలో హోస్ట్ నాగార్జున డ్యుయల్ రోల్‌తో దర్శనమివ్వడం విశేషం. ముందు హోస్ట్ నాగార్జున అడుగుపెట్టగా.. ఆయన తండ్రి పాత్రలో అతిథిగా ముసలి నాగార్జున వచ్చారు.

తర్వాత బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లి కలియతిరిగిన నాగ్‌…. తన స్టైల్లోనే పంచ్‌లు, చమత్కారాలతో అలరించారు.ఈ బిగ్ బాస్ సీజన్‌లో తొలి హౌజ్‌మేట్‌గా హీరోయిన్ మోనాల్ గజ్జర్ అడుగుపెట్టారు. సెకండ్ పార్టిసిపేట్‌గా సూర్య కిరణ్‌ దర్శకుడు బిగ్ హౌస్‌లో అడుగుపెట్టారు.