బిగ్ బాస్ 4..ఓటింగ్‌లో టాప్ ఎవరో తెలుసా..!

229
big boss 4
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు ప్రారంభమై 5 రోజులు పూర్తికావొస్తుంది. బిగ్ బాస్ 4 విజయవంతంగా 5వ ఎపిసోడ్‌ని పూర్తికాగా ఈవారం ఎలిమినేషన్‌లో సూర్యకిరణ్‌, అభిజిత్, అఖిల్, దివి, మెహబూబా,సుజాత,గంగవ్వలు ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇప్పటికే ఓటింగ్‌ ప్రారంభంకాగా ప్రారంభం నుండి దూసుకుపోతున్నారు గంగవ్వ.

తాజాగా అందిన సమాచారం ప్రకారం ఓటింగ్‌లో గంగవ్వ టాప్‌ పొజిషన్‌లో నిలిచినట్లు తెలుస్తోంది. మెజార్టీ నెటిజన్లు గంగవ్వ వైపు మొగ్గుచూపగా తర్వాతి స్ధానంలో అభిజిత్,దివి,సూర్య కిరణ్,మెహబూబ్,సుజాత,అఖిల్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ వారం ఎలిమినేట్ అయ్యేవారు ఎవరనేది మరికొద్దిగంటల్లో తేలిపోనుంది.

- Advertisement -