వలస విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టిన బైడెన్!

167
biden
- Advertisement -

అమెరికా వలస విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు అధ్యక్షుడు బైడెన్. ఇందుకు సంబంధించిన 3 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు బైడెన్. డాలర్‌ డ్రీమ్స్‌ కలలు తీరేలా, ముస్లింలపై నిషేధం ఎత్తివేసి దేశ సరిహద్దుల్లో సక్రమం పర్యవేక్షణ జరిగేలా వలస విధానం ఉంటుందన్నారు.

()ట్రంప్‌ హయాంలో చెట్టుకొకరు పుట్టకొకరుగా విడిపోయిన వలసదారుల కుటుంబాలను కలపడానికి హోంల్యాండ్‌ సెక్యూరిటీ మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు బైడెన్. విడిపోయిన తల్లిదండ్రుల్ని, పిల్లల్ని కలిపే కార్యక్రమాన్ని ఈ కమిటీ నిర్వహిస్తుంది.

() అమెరికాకు వలసలు పోటెత్తడానికి గల కారణాలను తెలుసుకొని వాటిని నివారించడం, మానవతా దృక్ఫథంతో శరణార్థుల్ని అక్కున చేర్చుకునే విధంగా వ్యూహాన్ని రచించడమే లక్ష్యంగా రెండో కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.

() స్వేచ్ఛాయుత చట్టబద్ధమైన విలస విధానానికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు బైడెన్. దేశంలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి వీలు కల్పించే గ్రీన్‌ కార్డు రాకుండా అడ్డుకునే పబ్లిక్‌ చార్జ్‌ నిబంధనల్ని ప్రభుత్వం సమీక్షిస్తుంది. విదేశాల్లో జన్మించి అమెరికాలో ఉంటున్న వారు 40 లక్షల మందికిపైగా ఉన్నారు. వీరిలో భారతీయులే అధికం. ఈ కొత్త అమెరికన్లు అమెరికా ఆర్థిక వ్యవస్థకి ఊతంగా ఉంటారని భావిస్తున్న బైడెన్‌ వారి ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఈ ఉత్తర్వుల్ని తీసుకువచ్చారు.

- Advertisement -