భారత్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తా: బైడెన్

191
biden
- Advertisement -

ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. డోనాల్డ్ ట్రంప్- జోసెఫ్ బైడెన్ మధ్య పోటీ నెలకొనగా ఇద్దరు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే, ఇండియాకు తన పాలనలో అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు జోసెఫ్ బైడెన్.

భారత్ తమ సహజ భాగస్వామి అని ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తానని బైడెన్ పేర్కొన్నారు. నిధుల సమీకరణ నిమిత్తం జరిగిన వర్చ్యువల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, భారత్ – యూఎస్ సంబంధాలపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

ఒబామా పాల‌న‌లో అమెరికా మాజీ ఉపాధ్య‌క్షుడిగా ఎనిమిదేళ్ల పాటు బైడెన్ బాధ్య‌త‌లు నిర్వర్తించారు. ద‌శాబ్ధం క్రితం ‌అమెరికా, భార‌త్ మ‌ధ్య పౌర అణు ఒప్పందం కుద‌ర్చ‌డంలో తాను పాత్ర పోషించిన‌ట్లు బైడెన్‌ తెలిపారు. తానెప్పుడూ ఇండియాకు పెద్ద మ‌ద్ద‌తుదారుడినే అని తెలిపారు.

- Advertisement -