అఫీషియల్…బైడెన్- మోడీ భేటీ డేట్ ఫిక్స్‌

161
modi
- Advertisement -

అమెరికా అధ్యక్షులు జో బైడెన్ – భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య భేటీకి డేట్ ఫిక్స్‌ అయింది. దీనిపై అధికారిక ప్రకటన చేసింది వైట్ హౌస్‌. సెప్టెంబర్ 24న జో బైడెన్‌, మోడీ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుందని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.

ఈ వారమే అమెరికా వెళ్లనున్నారు మోడీ. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా మోడీ – బైడెన్ మధ్య భేటీ జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. బైడెన్ కంటే ఒకరోజు ముందు అంటే సెప్టెంబర్ 23న మోడీ.. జపాన్, ఆస్ట్రేలియా ప్రధానులతో విడివిడిగా సమావేశం కానున్నారు.

వాషింగ్టన్‌లో సెప్టెంబర్ 24న నిర్వహస్తున్న క్వాద్రిలేటరల్ ఫ్రేమ్‌వర్క్‌ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ అధ్యక్షుడు యోషిహిడే సుగ, అమెరికా అధ్యక్షుడు జో బైడన్ కలిసి ప్రధాని మోడీ పాల్గొంటారు. . ఆ తర్వాత 25వ తేదీన న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు మోడీ.

- Advertisement -