లంకలో సైకిళ్లకు పెరిగిన గిరాకీ!

82
cycles
- Advertisement -

ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక ప్రజలు అల్లాడుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కులనంటుతుండటంతో ప్రజలు ప్రత్యామ్నాయమార్గాలను ఎంచుకుంటున్నారు.

దేశంలో ఇంధన కొరత నేపథ్యంలో వాహనాలకు బదులు సైకిళ్లను కొనేందుకు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో వీటికి ఫుల్ డిమాండ్ పెరిగింది. దుకాణాల్లో సైకిళ్లు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా వీటినే కొనుగోలు చేస్తున్నారు.

ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు కూడా వీటిపైనే వెళ్తున్నారు. దీంతో ప్రస్తుతం లంకలో చాలా మందికి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ గా సైకిళ్లు మారాయి.

- Advertisement -