ఘోస్ట్‌లో శివరాజ్ కుమార్!

75
shivaraj kumar
- Advertisement -

కింగ్ అక్కినేని నాగార్జున ‘ది ఘోస్ట్ ‘ చిత్రం ప్రమోషన్‌ లను ‘కిల్లింగ్ మెషిన్’ తో ప్రారంభించారు. ఈ చిత్రం నుండి కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్ లో నాగార్జున, తనపైకి వచ్చిన ఓ గుంపుని కత్తులతో తెగ నరకడం చాలా స్టైలిష్, యాక్షన్ ప్యాక్డ్ గా వుంది. నాగార్జున చాలా ఫిరోషియస్ అండ్ టెర్రిఫిక్ గా కనిపించారు. యువ సంగీత దర్శకులు భరత్ – సౌరభ్ ఇచ్చిన బీజీయం ఈ గ్లిమ్ప్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్ళింది.

కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్ ‘ది ఘోస్ట్’ పై మరిన్ని భారీ అంచనాలు పెంచింది. క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఒక యాక్షన్ సీక్వెన్స్ మినహా దాదాపు పూర్తి కావచ్చింది. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తామని కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్ ద్వారా మేకర్స్ ప్రకటించారు. నాగార్జున కల్ట్ క్లాసిక్, పాత్ బ్రేకింగ్ మూవీ ‘శివ’ కూడా 1989లో అదే తేదీన విడుదల కావడం విశేషం.

తాజాగా కన్నడస్టార్ హీరో శివరాజ్ కుమార్‌కి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. గన్ పట్టుకుని తీక్షణంగా చూస్తున్న శివరాజ్ కుమార్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సెర్చ్ లైట్, బైకర్స్, కార్స్, గన్స్.. వీటితో డిజైన్ చేసిన పోస్టర్ డిటైలింగ్ మెప్పిస్తోంది.

- Advertisement -