- Advertisement -
కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు శాంతిపురం నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. స్థానిక ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా నారా భువనేశ్వరిని మర్యాద పూర్వకంగా కలిశారు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు. కుప్పం ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కుప్పం నియోజకవర్గం స్థాయిలో స్వచ్ఛ భారత్ అవార్డులు గెలుచుకున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులను అభినందించారు నారా భువనేశ్వరి. అలాగే దయాళ్ శ్రవణ్ ఫౌండేషన్ స్పాన్సర్ చేసిన వినికిడి పరికరాలను పంపిణీ చేశారు.
Also Read:బిల్లుల ఆమోదంపై సుప్రీం కీలక తీర్పు
- Advertisement -

