20 ఏళ్లు పైబడిన వాహనాలు వాడుతున్నారా?

9
- Advertisement -

20 ఏళ్లు పై బడిన వాహనాలను వాడుతున్నారా అయితే మీకు షాక్. 20 ఏళ్లు పైబడిన మోటారు వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్ష రుసుమును పెంచింది ప్రభుత్వం.రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా నోటిఫికేషన్‌లో, వాణిజ్య వాహనాలకు (commercial vehicles) అధిక రుసుము శ్లాబ్‌లు ఇప్పుడు 15 సంవత్సరాల బదులు 10 సంవత్సరాల నుండే ప్రారంభమవుతాయని పేర్కొంది.

దీని ద్వారా మరిన్ని వాహనాలు పెంచిన ధరల పరిధిలోకి వస్తాయి.ఫిట్‌నెస్ పరీక్ష కోసం మూడు స్లాబ్‌లను ఏర్పాటుచేయగా 10-15 సంవత్సరాలు, 15-20 సంవత్సరాలు మరియు 20 సంవత్సరాల కంటే ఎక్కువ.

ఈ సంవత్సరం ఆగస్టులో జారీ చేసిన నోటిఫికేషన్‌లో రవాణా మంత్రిత్వ శాఖ పాత వాహనాల పునరుద్ధరణ ఛార్జీలను కూడా పెంచింది.కాగా, ఆగస్టులో, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో 10 ఏళ్ల కంటే పాత డీజిల్ వాహనాలు మరియు 15 ఏళ్ల కంటే పాత పెట్రోల్ వాహనాల యజమానులపై ఎటువంటి నిర్బంధ చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది.

Also Read:ఆర్టీసీ సోదరులపై దాడులను ఉపేక్షించం

- Advertisement -