- Advertisement -
ఛత్తీస్ ఘడ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్…ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.తనను పరమాత్మ పంపారని ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారని, మోడీ మాటలు ఆయన మానసిక స్ధితి కుదురుగా లేదని అర్థమవుతోందన్నారు బఘేల్.
తనకు ఇష్టం వచ్చినట్లుగా మోడీ మాట్లాడుతున్నారని… కాంగ్రెస్ మేనిఫెస్టోను ముస్లింలీగ్‌తో అజెండాతో పోల్చడం సరికాదన్నారు. మంగళసూత్ర, మటన్, ఫిష్, బఫెలో, ముజ్రా వంటి వ్యాఖ్యలు చేయడం మోడీ అవివేకానికి నిదర్శనమన్నారు.
రాహుల్ గాంధీ దేశాన్ని రెండు ముక్కలు చేసిన నేత మనవడని, అయితే మోడీ మాత్రం బిర్యానీ తినేందుకు నేరుగా పాకిస్తాన్ వెళ్లారని ఎద్దేవా చేశారు. నెహ్రూను అగౌరవపరిచి తాను గొప్ప వ్యక్తిగా చెలామణి కావాలని మోడీ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.
Also Read:నేటి ముఖ్యమైన వార్తలు..
- Advertisement -