ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో విజయం దిశగా దూసుకెళ్తుండగా ఛత్తీస్ ఘడ్‌లో కాంగ్రెస్ సీఎం భూపేశ్ భగేల్ వెనుకంజలో ఉన్నారు. పటాన్ సీటు నుంచి ఆయన వెనుకంజలో ఉన్నారు. భూపేశ్ భగేల్ అల్లుడు విజయ్ భగేల్ లీడింగ్‌లో ఉండగా రాజ్‌నందగావ్‌లో బీజేపీ నేత రమణ్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు.
90 స్థానాలు ఉన్న చత్తీస్‌ఘడ్‌లో బీజేపీ 49 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది. ఇక తెలంగాణలో బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సత్తా చాటలేకపోయారు. హుజురాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఈటల రాజేందర్ వెనుకంజలో ఉన్నారు. హుజురాబాద్‌లో ఈటల మూడోస్థానంలో కొనసాగుతున్నారు. ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఇక గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేసిన ఈటల రెండో స్థానంలో ఉన్నారు.
Also Read:Nithin:ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్..అదుర్స్