తెలంగాణ భవన్‌లో లగచర్ల భూ పోరాటానికి ప్రతీకగా నిలిచిన చిన్నారి భూమి నాయక్ మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. లగచర్లలో భూ సమస్యపై జరిగిన ఉద్యమ సమయంలో జన్మించిన లగచర్ల బాధితురాలు జ్యోతి కుమార్తెకు అప్పట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ “భూమి నాయక్” అని నామకరణం చేశారు. భూమి హక్కుల కోసం సాగిన పోరాటానికి గుర్తుగా, ఆ చిన్నారి పేరు ఉద్యమ భావాన్ని ప్రతిబింబించేలా పెట్టడం అప్పట్లో విస్తృత చర్చకు దారితీసింది.
శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన తొలి పుట్టినరోజు వేడుకలకు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేక్ కట్ చేసి చిన్నారిని ఆశీర్వదించిన నాయకులు, భూమి నాయక్ ఆరోగ్యంగా, సంతోషంగా ఎదగాలని ఆకాంక్షించారు. లగచర్ల భూ పోరాటంలో ఎదురైన కష్టాలను గుర్తు చేసుకుంటూ, భూమి నాయక్ పేరు న్యాయ పోరాటానికి ప్రతీకగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. ఈ వేడుకలు భావోద్వేగంగా, ఉత్సాహభరితంగా కొనసాగాయి.
Also Read:ఈడీ సోదాలు..కోట్ల రూపాయలు స్వాధీనం

