Bhumana:క్రీడాస్ఫూర్తితో ప‌నిచేయాలి

14
- Advertisement -

భ‌గ‌వంతుని సేవ‌లో ఉద్యోగులు క్రీడాస్ఫూర్తితో ప‌నిచేసి భ‌క్తుల‌కు మెరుగైన సేవ‌లు అందించాల‌ని టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి కోరారు. ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు శుక్ర‌వారం తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల ప‌రేడ్ మైదానంలో ప్రారంభమ‌య్యాయి. ఈ సంద‌ర్భంగా ఈవో శ్రీ ఏవి.ధ‌ర్మారెడ్డి ఉద్యోగుల‌తో క్రీడాప్ర‌తిజ్ఞ చేయించారు. ముందుగా ఛైర్మ‌న్‌, ఈవో క‌లిసి క్రీడాప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. బెలూన్లు, శాంతి క‌పోతాల‌ను ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగులు మార్చ్‌ఫాస్ట్ నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగుల‌కు మాన‌సిక ఒత్తిడిని త‌గ్గించేందుకు, క్రీడ‌ల ప‌ట్ల ఆస‌క్తిని పెంచేందుకు ప్ర‌తి సంవ‌త్స‌రం క్రీడాపోటీలు నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌న్నారు. క్రీడ‌ల‌తో శారీర‌క దారుఢ్యంతోపాటు పున‌రుత్తేజం క‌లుగుతుంద‌ని చెప్పారు. ఉద్యోగుల‌కు క్రీడ‌ల ప‌ట్ల ఉన్న శ్ర‌ద్ధ‌ను గ‌మ‌నించి ఇండోర్ స్టేడియం నిర్మాణానికి తమ బోర్డు రూ.10 కోట్లు కేటాయించిన‌ట్టు తెలిపారు. ఉద్యోగులు మంచి ప్ర‌తిభ క‌న‌బ‌రిచి క్రీడ‌ల్లో పాల్గొని బ‌హుమ‌తులు గెలుచుకోవాల‌ని కోరారు.

టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈఓ స్నేహలత మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం, వారి మాన‌సిక వికాసం కోసం 1977వ సంవ‌త్స‌రం నుండి ప్ర‌తి సంవ‌త్స‌రం ఉద్యోగుల‌కు క్రీడాపోటీలు నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు.

Also Read:ఓట్ మిల్క్ తాగితే.. ఎన్ని లాభాలో!

- Advertisement -