భూమా ప్రొడక్షన్స్ సమర్పించు..!

246
Bhuma
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ మాజీ టూరిజమ్ శాఖా మంత్రి, ఆళ్లగడ్డ టీడీపీ నేత భూమా అఖిల ప్రియ రాజకీయాల నుంచి సినిమాలవైపు టర్న్ తీసుకోబోతున్నారా? భూమా ప్రొడక్షన్స్ స్టార్ట్ చేయబోతున్నారా? అంటే అవున‌నే అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. భూమా నాగిరెడ్డి-శోభా దంపతుల రాజకీయ వారసురాలిగా ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ కీలకనేతగా ఉన్న సంగతి తెలిసిందే.

2014లో ఆళ్ళగడ్డ శాసనసభకు జరిగిన ఉప ఎన్నికలలో వైసీపీ తరుపున ఏకగ్రీవంగా ఎన్నికై.. అనతరం టీడీపీలో జాయిన్ అయ్యి మంత్రి పదవిని దక్కించుకుంది అఖిల ప్రియ. ఆంధ్రప్రదేశ్ మాజీ టూరిజమ్ శాఖా మంత్రిగా పనిచేసిన అఖిల ప్రియ.. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. ఆ ఎన్నికల అనంతరం ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీ హవా తగ్గడంతో పాటు.. భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని హతమార్చడానికి అఖిల ప్రియ స్కెచ్ వేసిందనే వార్తలతో ఆమె హాట్ టాపిక్ అయ్యారు.

ఇదిలా ఉంటే అధికార పార్టీ టీడీపీ నేతల్ని ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తుండటంతో భూమా అఖిల ప్రియ రాజకీయాలను కొనసాగిస్తూనే సేఫ్ జోన్‌గా సినిమా రంగం వైపు చూస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తన భర్త భార్గవ్ నాయుడు తో కలిసి మూవీ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారట అఖిల ప్రియ.

- Advertisement -