నేటి రోజుల్లో చాలా మంది గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చొని పనులు చేస్తూ వుంటారు. అలా ఎక్కువ సేపు కదలకుండా కూర్చొని పనులు చేయడం వల్ల వెన్ను సమస్యలు, నడుం నొప్పి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. తద్వారా ఏ పని సరిగా చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. దీంతో ఈ సమస్యల నుంచి బయటపడడానికి మెడిసన్స్ వాడడం, ఇంకా వైద్యుల సలహాలు పాటించడం వంటివి చేస్తుంటారు. అయితే వెన్ను నొప్పి సమస్యలను దూరం చేయడానికి యోగాలో నిర్ధిష్ట యోగాసనాలు ఉన్నాయి. వైద్యుల సలహాలు పాటిస్తూ ఆ యోగాసనాలు ప్రతిరోజూ సాధన చేయడం వల్ల ఎలాంటి వెన్ను సమస్యలైన దురమౌతాయి. అవేంటో తెలుసుకుందాం
భుజంగాసనం
ఈ ఆసనంలో ముందుగా బోర్లా పడుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత రెండు కాళ్ళను సమాంతర స్థితిలో ఉంచి కాళ్ళ వేళ్ళను నేలకు ఆనించి రెండు చేతులను నడుం దగ్గర ఉంచి చేతుల సహాయంతో నడుం నుంచి తల భాగం వరకు 40 డిగ్రీల కోణంలో పైకి లేపాలి. ఈ స్థితిలో ఉన్నప్పుడూ దృష్టి ఆకాశం వైపుగా పైకి చూస్తూ ఉండాలి. నెమ్మదిగా ఉచ్శ్వాస నిచ్శ్వాస లను జరిగించాలి. ఇలా కనీసం 20 సెకన్ల పాటు ఉంటూ.. 8-10 సార్లు ఈ ఆసనం వేయాలి. ఈ ఆసనం ద్వారా వెన్నెముక ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అంతే కాకుండా శరీర భాగాలన్నిటికి రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. ఇంకా ఏకాగ్రత పెరుగుతుంది.
ధనురాసనం
ఈ ఆసనంలో కూడా ముందుగా నేలపై బోర్లా పడుకొని రెండు కాళ్ళను పరస్పరం కలిపి ఉంచి మోకాళ్ళ వరకు మడవాలి. ఆ తరువాత రెండు చేతులను వెనుకకు తీసుకొని, రెండు కాళ్ళ యొక్క మడమలను పట్టి ఉంచాలి. ఆ తరువాత నడుము భాగం నుంచి తల భాగం వరకు మెల్లగా పైకి లేపుతూ శిరస్సు ఆకారంలో ఉండేలా చూసుకోవాలి. ఇలా వీలైనంతా వరకు ఈ ఆసనం చేయవచ్చు. ఈ ఆసనం సాధన చేయడం వల్ల వెన్నెముక ఫ్లెక్సిబిలిటీ పెరగడంతో పాటు ఉదర సంబంధిత సమస్యలు కూడా దురమౌతాయి.
చక్రసనం
ఈ ఆసనంలో నేలపై వెల్లకిల పడుకోవాలి. తరువాత రెండు కాళ్ళ ను మోకాళ్ళ వరకు మడుస్తూ చేతుల సహాయంతో నడుం భాగాన్ని పైకెత్తాలి. చేతులను నిడనంగా కాళ్ళ వైపునకు తీసుకొని వస్తు చక్రం ఆకారం వలె మారాలి. ఇలా ఒక నిముషం నుంచి ఐదు నిముషాల వరకు ఈ ఆసనాన్ని అభ్యాసం చేయవచ్చు. ఈ ఆసనం ద్వారా వెన్ను నొప్పి, నడుం నొప్పి వంటివి దూరం అవుతాయి. ఇంకా మలబద్దకం సమస్య దూరమై జీర్ణ శక్తి మెరుగు పడుతుంది.
Also Read:KCR:ప్రజల్లో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత