ఇంత అహంకార ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు అన్నారు స్టేట్ టీచర్స్ యూనియన్ మాజీ అధ్యక్షుడు భుజంగరావు. టీచర్స్ డే సందర్భంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి టీచర్లకు అవార్డులిచ్చే తీరిక రేవంత్ రెడ్డికి లేదా? అని ప్రశ్నించారు.
మార్పు మార్పు అని మేము కాంగ్రెస్ వెంట పరిగెడితే ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదు.. ఐదు శాతం ఐఆర్, ఐదు డీఏలు అడ్రస్ లేకుండా పోయినయ్ అన్నారు. ఏ మాటకామాట చెప్పుకోవాలి. రాజకీయాలు కాదు కానీ కేసీఆర్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషి అన్నారు. అడగకుండానే కేసీఆర్ 73% ఫిట్మెంట్ ఇచ్చాడు.. ఎన్నికల ముందు 5 శాతం ఐఆర్ ప్రకటించి, మళ్లీ అధికారంలోకి వస్తే పీఆర్సీ ఇస్తానన్నాడు. కానీ మార్పు అని కాంగ్రెస్ పార్టీని నమ్మితే నట్టేట ముంచిండు అన్నారు.
మేధావులమని గొప్పలు చెప్పుకునే కోదండరాంరెడ్డి, ఆకునూరి మురళి ఎక్కడికి పోయారు? అని ప్రశ్నించారు. ప్రజలు, విద్యార్థుల కష్టాలు కనపడడం లేవా? గురుకులాల్లో పురుగులన్నం పెడుతున్నరు. ఆర్జీయూకేటీ, పాలమాకుల గురుకులాల పిల్లలు రోడ్డెక్కారు. దీనిపై మేధావులు ఎందుకు స్పందించడం లేదు? అన్నారు.మేధావులు మీ గొంతులను అమ్మేసుకున్నరా? మీ వ్యక్తిత్వాన్ని కుదువ పెట్టుకున్నారా? భుజంగరావు.
Also Read:Revanth Reddy:అక్రమ నిర్మాణాల కూల్చివేత ఆగదు