మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రం మెగా మాసీవ్ ప్రమోషనల్ కంటెంట్ తో స్ట్రాంగ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. టీజర్ నుంచి పాటల వరకు సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ ఎలిమెంట్ తో ఆకట్టుకున్న మేకర్స్ ఈ రోజు థియేట్రికల్ ట్రైలర్ తో ముందుకు వచ్చారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్రైలర్ ని లాంచ్ చేశారు.
భోళా శంకర్ ట్రైలర్ కోల్‌కతాలోని అందోళనకర పరిస్థితులలో ఆసక్తికరమైన నోట్ తో ప్రారంభమవుతుంది. చాలా మంది యువతులు కిడ్నాప్ అవుతారు. వారి తల్లిదండ్రులు, పోలీసులు భయాందోళనలో వుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, కిడ్నాప్‌ల వెనుక ఉన్న సూత్రధారిని పోలీసులు కనుగొనలేకపోతారు. అప్పుడు భోళా శంకర్.. నేరస్థుడిని పట్టుకోవడానికి, అమ్మాయిలను రక్షించడానికి వస్తాడు. సీరియస్‌గా ప్రారంభమైన కథనం ఒకదాని తర్వాత ఒక ప్రధాన పాత్రల ప్రవేశంతో వినోదాత్మకంగా మారుతుంది.
చిరంజీవి వింటేజ్ అవతార్‌లో కనిపించి తన మాస్ పవర్‌ను మరోసారి చూపించారు. యాక్షన్‌తో పాటు వినోదాత్మక సన్నివేశాలలో కూడా ఎక్స్ టార్డినరిగా వున్నారు. డిఫరెంట్ సీన్స్ లో రాజశేఖర్, పవన్ కళ్యాణ్‌లను మెగాస్టార్ అనుకరిస్తూ కనిపించడం ఆసక్తికరంగా వుంది. తమన్నా భాటియా లాయర్‌గా, కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా , సుశాంత్ ఆమె బాయ్ ఫ్రండ్ గా కనిపించారు. వెన్నెల కిషోర్ భోళా సీనియర్‌గా కనిపించడం నవ్వులు పూయించింది.
ట్రైలర్ సూచించినట్లుగా భోళా శంకర్ ఒక మెగా-మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమా మాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు దర్శకుడు మెహర్ రమేష్. డడ్లీ సినిమాటోగ్రఫీ అత్యున్నతంగా వుంది. మహతి స్వర సాగర్ తన సలైవ్లీ స్కోర్‌తో విజువల్స్‌ను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాడు.
అనిల్ సుంకర ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నిర్మాణ ప్రమాణాలు వున్నత స్థాయిలో వున్నాయి. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, హైపర్ ఆది, వైవా హర్ష, ప్రదీప్, అనీ, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, వేణు టిల్లు, తాగుబోతు రమేష్, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, వీర్, షావర్ అలీ & తరుణ్ అరోరా
Also Read:సభ వాయిదా..మరి ప్రియాంకగాంధీ సంగతేంటి?